అధికారం శాశ్వతం కాదు, అనుబంధం శాశ్వతంగా ఉంటుంది !

👉ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత !

J.SURENDER KUMAR,

అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధం అనుబంధం అని,
సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, గెలుపు కోసం ,పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత మహిళల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..
ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కొసం కొట్లాడి నాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజల తోనే ఉంటున్నామని ఆమె అన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ పచ్చబడిందని స్పష్టం చేశారు.
పచ్చని తెలంగాణను ఆగం కానివ్వద్దు తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ది తీరిపోని బంధమని, కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు పెట్టే గుణం లేదని, అధికార కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు.

ఎన్నికలు ఉన్నాయని ఇతర పార్టీల వాళ్లు అది ఇస్తాము అది ఇస్తామని వచ్చి మాటలు చెప్పి పోతారని, కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశమిస్తే పెన్షన్ ₹ 200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని అన్నారు.
సీఎం కేసీఆర్ చెప్పింది చేసి చూపించారని అన్నారు., రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరో సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు ₹.5 వేలకు పెరుగుతుందని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ₹.3 వేలకు పెరుగుతుందని, ఆ తర్వాత ఏటేటా పెరుగుతూ ఐదేళ్లకు ₹.5 వేలకు చేరుతుందని వివరించారు.
కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు ₹ 3 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు
.