👉 ముగ్గురికి సింహం గుర్తు
👉ఒకరు ఇండిపెండెంట్
J.SURENDER KUMAR,
గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు, చేస్తున్న అభ్యర్థనలు, ఆందోళనలు, అర్ధనాదల ను ప్రభుత్వం పట్టించుకోలేదు, వివిధ రాజకీయ పార్టీలు సైతం ఏదో మొక్కుబడిగా పట్టించుకున్నట్టు పత్రికలలో ప్రకటనలు చేశారు తప్ప, వారి సమస్యల పట్ల వీధి పోరాటాలు చేసిన సందర్భంగా గానీ, ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భం లేదు. దీంతో విసిగి వేసారిన గర్ల్స్ సంఘాలకు చెందిన నలుగురు నాయకులు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.
వివరాల్లోకి వెళ్తే..
భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా

గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ),

చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల),

స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్) ముగ్గురు ఇప్పటికే బీ-ఫారాలు పొంది సింహం గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు.

సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని అభ్యర్థిత్వాన్ని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పరిశీలిస్తోంది. కాగా కొన్ని సమీకరణాల వలన టికెట్ ను పార్టీ అధిష్టానం పెండింగ్ లో ఉంచింది. టికెట్ వచ్చినా రాకున్నా సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని ఇండిపెండెంట్ గా కనిపించని నాలుగో సింహం వలె రంగంలో నిలవడం ఖాయం అని గల్ఫ్ సంఘాల ప్రతినిధులు తెలిపారు.