ఆట్టా హాసంగా నామినేషన్ వేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

👉కాంగ్రెస్ శ్రేణులతో పోటెత్తిన ధర్మపురి !


👉ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం అట్టాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక శ్రీ లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ , జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ధర్మపురి, బుగ్గారం, వెలుగ టూర్, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, ధర్మారం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాలకు చెందిన వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా భారీ సంఖ్యలో తరలి రావడంతో ధర్మపురి పట్టణం పోటెత్తింది.

బ్యాండ్ మేళాలు, చిత్రవిచిత్ర వేషధారణలతో, ఒగ్గు డోలు వాయిద్య కారులు, కాంగ్రెస్ శ్రేణులు డ్యాన్సులత, జాతీయ రహదారి ఎస్.ఆర్ గార్డెన్స్ నుంచి అంబెడ్కర్ చౌరస్తా, నంది ,గాంధీ చౌరస్తాలో మీదుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నంది చౌరస్తాలో భారీ సభను ఏర్పాటు చేశారు.

సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

రైస్ మిల్లర్ల పక్షాన మంత్రి ఈశ్వర్..
రైతుల పక్షాన లక్ష్మణ్ కుమార్..

రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి వరి ధాన్యం తాలు తప్ప పేరిట కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైస్ మిల్ యాజమాన్యులు క్వింటాలుకు దాదాపు పది కిలోలు తరుగు పేరిట రైతులను నిలువు దోపిడి చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. రైస్ మిల్లర్ల దోపిడి పై మంత్రి ఈశ్వర్ చర్యలు తీసుకోలేదని, రైతులకు న్యాయం చేయాలని లక్ష్మణ్ వీధి పోరాటాలు చేశారని ఆరోపించారు.


లక్ష్మణ్ కుమార్ ను గెలిపిస్తే ధర్మపురి లో. మార్కెట్లో కూరగాయలు ఇతరత్రా విక్రయిస్తున్న రైతుల నుంచి మున్సిపల్ వారు నిర్బంధంగా వసూలు చేస్తున్న రోజు వారి మార్కెట్, వారసంత డబ్బులు వసూలు ను రద్దు చేస్తామని. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ లో విక్రయదారులకు ఇబ్బందిగా మారిన గద్దెలు కూల్చి. రైతులు విక్రయదారులు కోరిన విధంగా నిర్మిస్తామని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ధర్మపురి ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి లక్ష్మణ్ కుమార్ లు ప్రజలను కోరారు.


ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..