👉జన సంద్రమైన జగిత్యాల పట్టణం!
J.SURENDER KUMAR,
జగిత్యాల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా తాటిపర్తి జీవన్ రెడ్డి అట్టహాసంగా మంగళవారం నామినేషన్ దాఖలా చేసారు.
ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామి కి ముడుపు కట్టిన అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ తో , జంబిగద్దే మీదుగా గొల్లపల్లి రోడ్డు, పాత బస్టాండ్ గుండా స్థానిక ఆర్ డీ ఓ కార్యాలయంకు చేరుకొని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
జన సంద్రమైన జగిత్యాల..

కాంగ్రెస్ శ్రేణుల్లో ఉరకలేత్తిన ఉత్సాహం..వీధులన్నీ కాంగ్రెస్ జెండాలతో .
ప్రశ్నించే గొంతుకకు పట్టం కడుతామంటు జగిత్యాల నలుమూల భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ ల పథకాల ప్లకార్డులు…కాంగ్రెస్ పార్టీ జెండాలు డప్పు చప్పుళ్లతో పులి వేషాదారులు.. ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనల తో తరలివచ్చిన అభిమానులతో జీవన్ రెడ్డి నామినేషన్ నామినేషన్ వేశారు.