👉ఈనెల 17న. పోలింగ్
👉ఛత్తీస్‌గఢ్ పోలింగ్ లో టెన్షన్..
👉సిబ్బందిని తరలించడానికి హెలికాప్టర్ లు
👉మావోయిస్టులకు భద్రత దళాలకు మధ్య కాల్పులు !
J.SURENDER KUMAR,
బస్తర్ ప్రాంతంలో ఎన్నికలు బహిష్కరించాలని ప్రజలకు మావోయిస్టులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 60 వేల మంది పోలీసు బలగాలను మోహరించారు.

మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా. మంగళవారం 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన తొలి విడత జరిగిన 20 స్థానాల పోలింగ్ లో స్వల్ప ఉద్రిక్త మధ్య కొనసాగింది. మావోయిస్టులు ఐఈడీ బాంబు పేలుడుతో సహా పలు చోట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు ను పేల్చారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరికి గాయాలయ్యాయి.

ఇదే జిల్లాలోని మిన్పాలో నక్సలైట్లు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు బాండా పోలింగ్ స్టేషన్ సమీపంలో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓర్చా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు.
సమస్యాత్మక దంతెవాడ, బీజాపుర్, అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కొండగావ్, కేష్‌కల్, నారాయణపుర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.

బస్తర్, జగదల్‌పుర్, చిత్రకోట్ సహా మిగిలిన స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి హెలికాప్టర్ లు ఉపయోగించారు.