బిజెపి సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి !

👉బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ కుమార్!

J.SURENDER KUMAR,

కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్ళి పార్టీ గెలుపు కు కృషి చేయాలని అని  ధర్మపురి అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ కుమార్ అన్నారు. 

ధర్మపురి మండల మరియు పట్టణ  కార్యకర్తల సమావేశం సోమవారం స్థానిక కర్నే అక్క పెళ్లి కళ్యాణ మండపంలో జరిగింది.  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి  ఎస్ .కుమార్  పాల్గొన్నారు


ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతి  బీజేపీ కార్యకర్త  కష్టపడి  పని చేయాలని,
బీజేపీ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్ళి గెలుపు కు కృషి చేయాలని అని అన్నారు.
ఈ సందర్భంగా ధర్మపురి  మండలం కమాలపుర్ గ్రామానికి చెందిన 20 మంది యువకులు  కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరియు నరేంద్ర మోడీ పరిపాలన ఆకర్షితులై బిజెపి పార్టీలో చేరారు.
వారికి బీజేపీ  కండువా కప్పి కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు