బిజెపి అభ్యర్థి కుమార్ నామినేషన్ కు తరలివచ్చిన కాషాయ క్యాడర్ !

J.SURENDER KUMAR,

బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ నాయకుడు, ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి సోగాల కుమార్, బుధవారం నామినేషన్ సందర్భంగా భారీ సంఖ్యలో కాషాయ క్యాడర్ కదిలి వచ్చింది.


ఎస్ . కుమార్ ముందుగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ దర్శించుకుని, స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయించారు.


నంది చౌక్ నుంచి, అంబేద్కర్ చౌక్ మీదుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి. భాజ భజంత్రీలు, పెద్దపులి వేషధారణ, డిజె పాటలు, కాషాయ జెండాలు, పార్టీ జెండాలు పట్టుకొని కార్యకర్తలు భారత్ మాతాకీ జై అంటూ, నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ కుమార్, ఊరేగింపులో కర్ర సాము చేసి క్యాడర్ ఉత్సాహపరిచారు.

పట్టణంలో దాదాపు మూడు గంటల పాటు ఊరేగింపు కొనసాగింది. ఊరేగింపుగా తరలి వెళ్లారు