👉 జగిత్యాలలో’జాగో తెలంగాణ ‘ బస్ యాత్ర లో
👉 జస్టిస్ చంద్ర కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
J.SURENDER KUMAR,
బిఆర్ ఎస్, బిజెపి రెండు పార్టీలు ఒక్కటే నని, వీరిని ఓడగొడితే నే మన బ్రతుకు అంటూ మాజీ జస్టిస్ చంద్ర కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు.
గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక అధ్వర్యంలో జాగో తెలంగాణ అంటూ బస్ యాత్ర తో వారు జగిత్యాల కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ లో తెలంగాణ ప్రజలను, ఓటర్లను ఉద్దేశించి వారు మాట్లాడారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, ఐఏఎస్ రిటైర్డ్ వాళ్ళు రాష్ట్రంలో జరిగిన అవినీతి, ఆర్థిక దోపిడీ రాజకీయాలను ఓడిద్దామని పిలుపునిచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాలు, దోపిడీ, ప్రజా వ్యతరేక పాలనా విధానాలను వారు కండ్లకు కట్టినట్లుగా ప్రజలకు వివరించారు. తెలంగాణ ఆర్థిక దోపిడి రాజకీయాలకు దూరంగా ఉండాలని మీ ఓటు హక్కు ద్వారా నిస్వార్థమైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్ర కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ పద్మజ, హైకోర్టు న్యాయవాది నయనాల గోవర్ధన్, కృష్ణ ప్రసాద్, గాజుల సత్యనారాయణ,
దళిత లిబ రేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, చుక్క గంగారెడ్డి, సామాజికవేత్తలు, స్థానిక న్యాయవాదులు, విద్యావంతులు, జెఎసి నాయకులు, తదితరులు, ప్రజలు పాల్గొన్నారు.