👉ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత 30 రోజులుగా ప్రస్తుత ధర్మపురి సిఐ మల్యాల సిఐ, మరియు కొంత మంది సబ్ ఇన్స్పెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని వారిపైన ఒత్తిడి చేస్తున్నారని, పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ధర్మపురి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.
మీడియా సమావేశం ముఖ్యాంశాలు
👉 పోలీసులు శాంతిభద్రతల విషయంలో ఎన్నికల సమయంలో అందరిని సమానంగా చూడాల్సి బాధ్యత ఉంటుందన్నారు.
👉 ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసమే పనిచేస్తున్నారు అనే విధంగా పోలీస్ ల వ్యవహారం కనిపిస్తుంది అని ఆరోపించారు.
👉 పోలీసులు శాంతిభద్రతల విషయంలో ఎన్నికల సమయంలో అందరిని సమానంగా చూడాల్సి ఉంటుంది.
👉 ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను బదిలీ చేసి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
👉 గత 15 రోజుల నుండి తన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ధర్మపురి కి వచ్చి గోదావరి రెసిడెన్సి లో ఉంటున్నారని అన్నారు.
👉 శనివారం రాత్రి 11.59 నిమిషాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు తన కుటుంబ సభ్యులు ఉంటున్న గోదావరి రెసిడెన్సీ కి వచ్చి వారిని కులం పేరుతో దూషించి, రేపటి లోగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలని, లేకపోతే చంపేస్తాం అని బెదిరించారు అని వివరించారు.
👉 దానికి సంబందించిన సంఘటనలు సీసీటీవీలో రికార్డు కావడం జరిగింది, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సంఘటన పైన ఫిర్యాదు చేయడం, జరిగింది. ఫోన్ ద్వారా డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే డిఎస్పి స్పందించి వారి పైన కేసులు నమోదు చేస్తాం అని చెప్పడం జరిగింది అని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఆదివారం పగలు మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, కుమార్తె నందిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, బెదిరించిన వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు బయట తిరుగుతున్నారు అని, దీనికి పూర్తి బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ వహించాలి అని డిమాండ్ చేశారు.
👉 ఇదే సంఘటన పైన ఎన్నికల కమిషన్ అధికారులకి మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది .
👉 మేము మీ ప్రభుత్వ వైఫల్యాలను, అదే విధంగా అధికారంలోకి వచ్చాక మేము ఏమి చేస్తామో ప్రజలకు వివరిస్తూ ఓట్లను అడుగుతున్నామన్నారు.
👉 ఎమ్మెల్సీ కవిత ధర్మపురి పర్యటనకు వస్తే బందోబస్తు ఇచ్చిన పోలీసు అధికారులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎందుకు బందోబస్తు ఇవ్వలేకపోయారు అని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
👉 ఇట్టి విషయాల పైన 48 గంటల లోపల అధికారులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా కార్యచరణను ప్రకటిస్తాం. ఆ ని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు