👉డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి ఆలయ అభివృద్ధికి ₹ 500 కోట్ల నిధులు ఎక్కడ కేటాయించారు సీఎం గారు అంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ధర్మపురిలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియా సమావేశ ముఖ్యాంశాలు..
👉ధర్మపురి ఆలయ అభివృద్ధికి 500 వందల కోట్ల రూపాయలు ఇస్తామన్న ముఖ్యమంత్రి కెసీఆర్ హామీ ఏమైంది. అంటూ ప్రశ్నించారు
👉2016 లో మంత్రి హరీష్ రావు మరియు కొప్పుల ఈశ్వర్ రోల్ల వాగు శంకుస్థాపన కర్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు అట్టి ప్రాజెక్ట్ కు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు
👉ధర్మపురిలో యజ్ఞాలు యాగాలు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్ యాదాద్రి తరహాలో ధర్మపురి దేవాలయాన్ని ఎందుకు అభివృద్ధి చెయ్యడం లేదో సమాధానం చెప్పాలి.
👉ధర్మపురి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఎన్ని తీసుకువచ్చారో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పాలి
👉ధర్మపురిలో బస్ డిపో గాని, ఐటిఐ కళాశాల, అధునాతన సదుపాయాలతో ఆసుపత్రి గాని, త్రాగడానికి శాశ్వత నీటి సదుపాయం లేవు.
👉కాళేశ్వరం లింక్ 2 కింద 700 వందల ఎకరాల భూమిని పోలీసులను కాపలా పెట్టి బలవంత లాక్కున్న దాని మీద స్పందించరు, ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం అందించే విషయంలో మంత్రి స్పందించరు.
👉అసెంబ్లీ సాక్షిగా పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని దానికి లక్ష్మి నరసింహ రిజర్వాయర్ అని పేరు పెడుతామని చెప్పిన మాటలు ఏమయ్యాయి
👉మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దళితుల మీద చీత్తశుద్ధి ఉంటే ధర్మపురి నియోజకవర్గంలో ఎంత మంది అర్హులైన దళిత నిరుద్యోగులు ఉంటే అంత మందికి గ్రామ సభలు నిర్వహించి దళితబందు ఇవ్వాల్సి ఉంటుంది
👉 2004 లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆస్తులు అప్పుడు ఎన్ని ? ఇప్పుడు ఆస్తులు ఎన్ని ? LM కొప్పుల ట్రస్టుకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో ? సమాధానం చెప్పాలి..
👉 ఇథనాల్ ప్రాజెక్ట్ మీద ఎక్కడి కంటే అక్కడికి చర్చకు వస్త, జగిత్యాల అంబెడ్కర్ వద్ద చర్చకు సిద్ధం, తప్పు ఉంటే ముక్కు భూమికి రాస్త అని సవాల్ విసిరిన మంత్రి , జీవన్ రెడ్డి టైం డేట్ చెప్పి చర్చకు సిద్ధం అని సవాల్ స్వీకరిస్తే దానికి మంత్రి ఎందుకు స్పందించ లేదు.
👉 ముఖ్యమంత్రి కెసీఆర్, స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు