👉పైలెట్ చాకచక్యం తో తప్పిన ప్రమాదం.!
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తుండగా.. సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. దీంతో అధికార యంత్రాంగం, ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మరో హెలికాప్టర్ రాగానే కేసీఆర్ పర్యటన యధావిధిగా దేవరకద్ర ప్రజా ఆశీర్వాదం సభకు వెళ్లారు.