👉 జర్నలిస్టుల స్వప్నం నెరవేర్చారు !
J.SURENDER KUMAR,
జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిసి జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల చిరకాల స్వప్నం నెరవేర్చారు సీఎంను అభినందించారు. ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, జర్నలిస్టులు సీఎం జగన్ కు శాలువా కప్పి అభినందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి వి ఆర్ కృష్ణంరాజు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి విజయ్ భాస్కర్, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కె బి జి తిలక్, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి దారా గోపి, ది హిందూ ప్రతినిధి అప్పాజీ రెడ్డిమ్, దక్కన్ క్రానికల్ ప్రతినిధి ఎండీ ఇలియాస్, ఎన్‌టీవీ ప్రతినిధి రెహానా, టీవీ 9 ప్రతినిధి ఎస్ హసీనా, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, సాక్షి దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎం రమణమూర్తి పలువురు సీనియర్ జర్నలిస్టులు.