కాంగ్రెస్ లో చేరిన ధర్మపురి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి !

👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో…


J.SURENDER KUMAR,

తెలంగాణ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం భాస్కర్ రెడ్డి, బుధవారం తన అనుచరులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరియు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ధర్మపురి పట్టణ బ్రాహ్మణ సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి భాస్కర్ రెడ్డి అతని అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ,లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, అప్పటి కలెక్టర్ శరత్ పుణ్యమా అని ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి చేసిన అభివృద్ధి ఏమి లేదని, ఆరోపించారు.
పట్టణంలో.ఐటిఐ కళాశాల గాని, అధునాతన సదుపాయాలతో ఆసుపత్రి గాని లేవని, తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రజానికానికి త్రాగు నీరు అందని పరిస్థితి నెలకొందని, ఆరోపించారు.

ప్రభుత్వ పథకాలను కేవలం వారి పార్టీ నాయకులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, ఇతర పార్టీలకు చెందిన వారిని తన పార్టీలోకి ఎలా తీసుకెళ్లాలని చూడటం తప్ప ధర్మపురి అభివృద్ధి గురించి ఎప్పుడు ఆలోచించ లేదని, వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు