👉అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
J.SURENDER KUMAR,
ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ , బంధువులను, ఆదివారం రాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో కొందరు గుర్తుతెలియ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డట్టు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు.

లక్ష్మణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయడానికో, దైవ దర్శనానికో అతడి బంధువులు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లోని ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో గోదావరి రెసిడెన్సి బ్లాక్ లో ఉంటున్నారు.

రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు భయభ్రాంతులకు గురైన వారు, మహిళతో సహా పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి రక్షణ కోరినట్టు సమాచారం.

అయితే ఫంక్షన్ హాల్ లోని సిసి టీవీ కెమెరాలలో గుర్తు తెలియని వ్యక్తుల కదలికలు రికార్డ్ అయినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.