👉 ఐటి ఫోన్ నెంబరు 8985970941
👉కంట్రోల్ రూమ్ 18004 257620
👉టోల్ ఫ్రీ నెంబర్:1950 కు డయల్
👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా..1
J.SURENDER KUMAR,
ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడానికి డబ్బు, మద్యం మరియు ఇతర వస్తువులు నిల్వ ఉంచినట్టు మీ వద్ద సమాచారం ఉంటే జిల్లా, ఎన్నికల సంఘానికి, యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సిందిగా జగిత్యాల జిల్లా ప్రధాని ఎన్నికల అధికారిని మరియు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ప్రకటనలో కోరారు.

జిల్లా IT శాఖ అధికారి ఫోన్ నెంబరు 8985970941కు, CVIGIL ఆఫ్ ద్వారా, జిల్లా కంట్రోల్ రూమ్ 18004257620 , టోల్ ఫ్రీ 1950 ద్వారా సమాచారము ఇచ్చి బహుమతులు పొందాలని పేర్కొన్నారు.
బాధ్యత గల పౌరులుగా ఇట్టి విషయమును జిల్లా యంత్రాంగమున కు తెలియపరచిన వారి ఫోన్ నెంబరు, మరియు వారి వివరములు రహస్యంగా ఉంటుందని మరియు వారికి తగిన పారితోషకము ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను సమర్దవంతముగా, పారదర్శకముగా నిర్వహించుటకు ఇందులో దేశ పౌరులందరి భాగస్వామ్యము అవసరము. ఇట్టి ఎన్నికలను పారదర్శకముగా నిర్వహించుటకు గాను మనము అంత కలసి కట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ షేక్ యాసిన్ భాషా ప్రకటనలో పిలుపునిచ్చారు.