J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. ధర్మపురిలో జనసంద్రం పోతేత్తింది. బీఆర్ ఎస్ అభ్యర్థిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ రిటర్నింగ్ అధికారికి గురువారం నామినేషన్ పత్రాలు అందచేశారు.

ముందుగా ధర్మపురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం, రామగుండం లోని విజయదుర్గా దేవి అయ్యప్ప స్వామి ఆలయాల్లో కొప్పుల దంపతుల ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, నియోజకవర్గం కు చెందిన జీడ్పిటీసి సభ్యులు బాధినేని రాజేందర్, పుస్కూరి పద్మజ, మండల పరిషత్ సభ్యులు ముత్యాల కరుణశ్రీ, ,బలరాం రెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు,మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నేతలు నామినేషన్ సందర్బంగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు.

నామినేషన్ కు అడుగడుగునా డప్పుచప్పుళ్లు, కోలాటాలు, తప్పెట్లు, బతుకమ్మలు కోలాటలతో మహిళలు ముందు నడిచారు. ధర్మపురి విధులన్నీ గులాబీ మాయం అయ్యాయి. రోడ్లకు ఇరువైపులా నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలతో సందడిగా మారింది.