👉దారులన్నీ ధర్మపురి వైపే..
J.SURENDER KUMAR,
ధర్మపురి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. నియోజకవర్గ పరిధిలోని మండలాల, గ్రామాల దారులన్నీ ధర్మపురి వైపు నది వరద తరహా లో కదిలి వచ్చారు. సభకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలతో కళాశాల మైదాన సభ ప్రాంగణం మూడు గంటలకే కిక్కిరిసిపోయింది.

వేలాది మంది జనం మైదానం బయట నుంచి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆలకించారు. ఒగ్గు డోలు నృత్య కళాకారులు, బ్యాండ్ మేళాలతో, సభ ప్రాంగణంలోకి రేవంత్ రెడ్డిని స్వాగతించారు.

👉రేవంత్ రెడ్డి సభలో హైలెట్స్…
👉 రేవంత్ రెడ్డి హెలికాప్టర్ 3-50 నిమిషాలకు ల్యాండ్ అయింది.
👉 కళాశాల మైదానంలోని సభా వేదిక పైకి 3-55 నిమిషాలకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు.
👉 రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి వచ్చారు.

👉 హెలిపాడ్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, ధర్మపురి ఆలయ ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు గిరి నాగభూషణం, బండ శంకర్, రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు.

👉 రేవంత్ రెడ్డి 4-15 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి 4-30 కి ముగించారు.
👉 భారీ సంఖ్యలో యువకులు రావడం చాలా సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రత్యేకంగా యువతను గుర్తు చేస్తూ అభినందించారు.

👉 వేదికపై రేవంత్ రెడ్డి తో జువ్వాడి నర్సింగరావు, చెవిలో మాట్లాడుతూ సభికులకు అగుపించారు.
👉 వేదికపై రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సంగనభట్ల దినేష్, ఏదో అంశంపై మాట్లాడుతూ నవ్వుకున్నారు.

👉 రేవంత్ రెడ్డి వెంట హెలికాప్టర్ లో తిరిగి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వివేక్ వెళ్లలేదు. ధర్మపురి నుంచి తమ వాహనాలలో వెళ్లిపోయారు.

👉 జాతీయ రహదారి, కళాశాల మైదానంలో భారీగా జనంతో పోటెత్తిన ఎలాంటి తొక్కి సలాట, ట్రాఫిక్ జామ్ కాకుండా డీఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సమన్వయంతో విధులు నిర్వహించారు.
👉 దోనూరు గ్రామానికి చెందిన నర్సింలు యాదవ్, రేవంత్ రెడ్డికి నాగలి బహూకరించారు.

👉 సభ అనంతరం సభ ప్రాంగణంలో యువకులు ఈలలు, కేకలతో డీజే పాటలతో గ్రూపులు, గ్రూపులుగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు .
👉 ఆయా గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం నేల తాళాలతో ఊరేగింపుగా కళాశాల మైదాన ప్రాంగణంలోకి తరలివచ్చారు.

👉ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ముగిసిన తర్వాత స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.