👉ధర్మపురి సభలో రేవంత్ రెడ్డి…
J.SURENDER KUMAR,
గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అభిమానంతో ఓట్లు వేసి లక్ష్మణ్ కుమార్ ను గెలిపించినా ఈవీఎంలు తారుమారు చేసి ధర్మపురిలో బీఆర్ఎస్ గెలిచిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఓడించడానికి కేసీఆర్ కుట్ర చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ధర్మపురిలో శనివారం జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గెలిచిన ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా ? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలిచినా ఓడిన 20 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నాడు అన్నారు.
కాంగ్రెస్ ను గెలిపిస్తే మీ కష్టాలు తీర్తాయి, అందరం కలిసి అవినీతి ముఖ్యమంత్రి కెసిఆర్ కు బై బై చెప్పి సాగనంపాలి అనిపిలుపు నిచ్చారు.

ఎమ్మెల్యేలు గా, మంత్రులుగా పనిచేసిన రత్నాకర్ రావు, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల హాయం లో ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని రేవంత్ రెడ్డి అన్నారు.
తలాపున గోదావరి పారుతున్న, తాగునీటికీ సాగునీటికి ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపులో 9 వస్తువులు వచ్చేవని. కానీ బీఆర్‌ఎస్ పాలనలో దొడ్డు బియ్యం తప్ప ఏమీ రావట్లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని అన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డలో ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిపోయిందని.. ఇది కేసీఆర్ పనితనమని అన్నారు. ఇంటింటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని మాట ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ₹15 వేలు, ₹.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఉద్యోగాలు, ఇళ్లు, పింఛన్ రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు, రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ గెలవాలి రేవంత్ రెడ్డి అన్నారు.
కాలేశ్వర ప్రాజెక్టులో కేసీఆర్. రోళ్ళ వాగు ప్రాజెక్టులో మంత్రి ఈశ్వర్ కమిషన్లు దండుకున్నారు !
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

ఈ సభలో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం అంచనాలు పెంచి అవినీతికి పాల్పడిన మంత్రి కొప్పుల ఈశ్వర్ పై విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి…
గల్ఫ్ బాధితులు అధికంగా ఉండే ప్రాంతం ఇది , ఎదిగిన బిడ్డలంతా గల్ఫ్ కు వెళ్లి ఏటా ₹ 1200 కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని రాష్ట్రానికి తెస్తున్న గల్ఫ్ బిడ్డల బాధలు తీర్చడానికి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సూచించారు. బతుకు దెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లి అసువులు బాసిన కార్మికుల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తే బాధితులకు ఆర్థికంగా అండగా ఉంటుందని సూచించారు. సీఎం కేసీఆర్ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ 9 సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, తదితరులు ప్రసంగించారు. ఏఐసీసీ పార్లమెంటు పరిశీలకుడు మోహన్ జోషి, కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వడి నర్సింగారావు, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, సంగనభట్ల దినేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, పెగడపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, జిల్లా కాంగ్రెస్ మహిళా తాటిపర్తి విజయలక్ష్మి, రాష్ట్ర నాయకుడు బండ శంకర్, స్థానిక మహిళా కౌన్సిలర్లు, నాగలక్ష్మి రాజేష్, జక్కు పద్మా రవీందర్, గరిగే అరుణ రమేష్, వివిధ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు తదితరులు సభ వేదిక పై ఉన్నారు.