👉 హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్..
👉 బీఆర్ఎస్ కు మద్దతు తీర్మానం..
J.SURENDER KUMAR,
అసెంబ్లీ ఎన్నికల్లో మున్నూరు కాపు సంఘం బీఆర్ ఎస్ కు మద్దతు ప్రకటించింది. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ధర్మపురి నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్, స్థానిక మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ తో పాటు నియోజక వర్గం పరిధిలోని ఏడు మండలాలకు చెందిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్ కు ఓటు వేస్తామని సభలో తీర్మానం చేశారు.