👉జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, కలెక్టర్ కు ఆదేశాలు జారీ..
👉రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ !
J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా, నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్, జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, మరియు కలెక్టర్ షేక్ యాసిన్ భాషా కు ఆదేశాలు జారీ చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మపురి గోదావరి నది ఒడ్డున సాయిబాబ గుడి ఆలయం ముందు సర్వే నెంబర్ 17, 18 లో నిర్మిస్తున్న రోడ్డు, తమకు తెలియకుండా, తమ అనుమతి లేకుండా, తమ పట్టా భూములకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని, భూ యజమానులు ఈనెల 8న కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

భూ యజమానుల ఫిర్యాదు మేరకు . ఈ నెల 10న లేఖ సంఖ్య. G1/773/2020, ద్వారా రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాల్సిందిగా జగిత్యాల ఆర్డిఓ, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు పనులు యధావిధిగా కొనసాగడంతో భూ యజమానులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ , తేదీ 18/11/2023,న లేఖ Memo.No. 9437/Elecs-A/A1/ 2023-1, సంఖ్య ద్వారా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రోడ్డు పనులను వెంటనే నిలిపియాల్సిందిగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పనులు చేపట్టవద్దని జిల్లా ప్రధాన ఎన్నికల అధికారిని మరియు కలెక్టర్ కు జారీచేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు