J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన కూతురు శ్రీమతి నందిని ముందుగా కవితకు పుష్పగుచ్చం నుంచి ఘనంగా స్వాగతించారు.

ముందుగా ఈ మధ్య ధర్మరాజును సందర్శించుకుని ఆమె ఆలయం చుట్టూ ప్రదక్షిణం నిర్వహించి మొక్కులు చెల్లించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపు కట్టారు. అర్చకులు, వేద పండితులు ఘనంగా ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రాన్ని బహుకరించారు.