J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ సీనియర్ ఐఏఎస్ అధికారులు బసవ రాజేంద్ర , రాజీవ్ మీనన్ , పోలీస్ అబ్జర్వర్ సీనియర్ ఐపీఎస్ అధికారి వివేకానంద్ సింగ్ లు దర్శించుకున్నారు.

వీరికి దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు ముఖ్య అర్చకులు రమణయ్య , సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ డిప్యూటీ తాసిల్దార్ గణేష్, రెవెన్యూ సిబ్బంది తదితరు వెంట ఉన్నారు.
