ధర్మారం, ఎండపల్లి మండలలో పలువురు కాంగ్రెస్ లో చేరిక !

👉 కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో..


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం, ఎండపల్లి మండలలా కు చెందిన వివిధ గ్రామాల కు చెందిన పలువురు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ధర్మారం మండలంలోని గోపాల్ రావు పేట ఎంపిటిసి సభ్యురాలు జనగామ లక్ష్మి రాజయ్య, దొంగతుర్తి సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఎర్రగుంటపల్లి సర్పంచ్ కొత్త లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహం,

రచ్చపల్లి మాజీ సర్పంచ్ దేవిఅరుణ వీరేశం, గోపాలరావుపేట మాజీ సర్పంచ్ స్వామి, సామనపల్లి మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, కటికనపల్లి ఉపసర్పంచ్ గంగారెడ్డి, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య, మరియు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు చేరారు.

వీరికి అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ ను గెలిపిస్తామని ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర రావు, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఎండపల్లి మండలంలో..


పెద్దపల్లి మండలం అంబారీపేట. ఉప సర్పంచ్ పల్లికొండ రాజేష్, నాయకులు దర్శనాల నరేష్ యాదగిరి తదితరులతోపాటు భారీ సంఖ్యలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుండేటి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిక కార్యక్రమం జరిగింది. వీరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పార్టీలోకి స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో వెల్గటూర్ సర్పంచ్, మురళి గౌడ్ , పాషిగమా సర్పంచ్ బొప్పు తిరుపతి, ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి, జిల్ల యూత్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు, మండల యూత్ అధ్యక్షులు పుధారి రమేష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ మెరుగు నరేష్ గౌడ్, గెళ్లు శ్రీనివాస్ , గ్రామ శాఖ అధ్యక్షులు బొరకుంట రాజయ్య, ‘పార్వతి, సాయి, రవి, అశోక్, ముగల శేకర్ , తది తరులు పాల్గొన్నారు