ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు.. రాజకీయ పార్టీలు కాదు – సీఎం కేసీఆర్ !

👉ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో…

J.SURENDER KUMAR,

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని.. రాజకీయ పార్టీలు కాదని సీఎం కేసీఆర్ అన్నారు.  గురువారం ధర్మపురి క్షేత్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..
ఎన్నికలలో అభ్యర్థిని మాత్రమే కాకుండా అతడి వెనక ఉన్న పార్టీ గుణగణాలు, చరిత్ర చూసి బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ధరణి పోర్టల్ ఉండటం వల్ల రైతుల మధ్య భూమి గొడవలు లేవని  కేసీఆర్ పునరుద్ఘాటించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మళ్లీ లంచాలు, దళారుల రాజ్యం వస్తుందని వాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే అశాంతి చెలరేగుతుందని ఆరోపించారు. ఎవరు అడ  అడగకుండానే.. రైతుబంధు, దళితబంధు తెచ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు ధర్మపురిలో ఘనంగా జరుపుకున్నామని అన్నారు.. గోదావరి పుష్కరాలు అంటే  రాజమండ్రి కృష్ణ పుష్కరాలు అంటే విజయవాడ మాత్రమే గుర్తొచ్చేదని.. తన డిమాండ్‌తోనే ధర్మపురిలో పుష్కరాలు జరుపుకున్నామని చెప్పారు. కొప్పుల ఈశ్వర్ ధర్మపురిని బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అభ్యర్థి చరిత్రతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా గమనించాలని ప్రజలకు  కొప్పుల ఈశ్వర్ సౌమ్యశీలి అని.. మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని కొనియాడారు.

ఈశ్వర్.. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతారని.. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని సీఎం కోరారు.

ఓటు వజ్రాయుధం..

దేశ ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పూర్తిగా రాలేదు. ఎన్నికల్లో ప్రజలు గెలవనంతవరకు దేశం బాగుపడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుధం ఓటు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ఇవాళ దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుంది. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కోసం, ప్రజల బాగుకోసం పుట్టిందే బీఆర్ఎస్. ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎంతో మంది వ్యక్తులు ఎన్నికల్లో నిల్చొంటారు. ఒక్కరే గెలుస్తారు. గెలిచిన వ్యక్తుల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అభ్యర్థుల వెనక ఏ పార్టీ ఉందన్నది చూడాలి.
తెలంగాణ సాధించిన వ్యక్తిగా చెప్పడం తన బాధ్యత అని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ వచ్చి ఒక్క ఛాన్స్ అంటోందని.. అధికారమిస్తే పంటికి అంటకుండా మింగుదామని  కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ధర్మపురిలో లక్షా 30 వేల ఎకరాలు సాగునీరు వచ్చేలా చేశామని.. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు బాగు చేసుకున్నామని.. చెక్ డ్యాంలు కట్టుకున్నామని అన్నారు. 

👉 సీఎం సభలో హైలెట్స్..

👉 పగలు 2  గంటలకు షెడ్యూల్ కాగా, సాయంత్రం 4-41 నిమిషాలకు సీఎం కేసీఆర్ వేదిక పైకి చేరుకున్నారు.

👉 సభ వేదిక కలియ తిరిగి సీఎం ప్రజలకు అభివాదం చేశారు

👉 మొదట మంత్రి కొప్పుల ఈశ్వర్ 4-43. నిమిషాలకు స్వాగత ఉపన్యాసం ప్రారంభించి 4-47.నిమిషాలకు ముగించారు.

👉 సీఎం కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభంలో వేదికపై ఉన్నవారి పేర్లను సంబోధిస్తూ.( ఆ సమయంలో వేదికపై లేని ) జగిత్యాలఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు సైతం సంబోధించారు

👉 ధర్మపురి ప్రముఖ కవి శేషప్ప పద్యం “భూషణా వికాస శ్రీ ధర్మపురి నివాస” అంటూ సీఎం  ఆలపించారు.

👉 సీఎం కుడివైపు గల అంగరక్షకుడి కి ఫోన్ రావడంతో హెలిక్యాప్టర్ పైలెట్ అని సీఎంకు సమాచారం ఇచ్చారు.

👉 హెలికాప్టర్ తో  ఇదో తిప్పలు. 5- 05 నిమిషాలు అయితే అది ఎగరదు. నేను పోయి యాగంలో జాయిన్ కావాలి సీఎం సభను ఉద్దేశించి అన్నారు.

👉 ఈ సభ చూస్తే ఈశ్వర్ 70, 80 వేల ఓట్ల తో గెలుస్తాడని తేలిపోయిందన్నారు.

👉 ప్రసంగం ముగించుకొని తిరిగి వెళుతుండగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇందారపు రామయ్య   స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్  సంఘీ సత్యమ్మ సీఎం కేసీఆర్ కు బహూకరించారు.

👉 సీఎం కేసీఆర్ తన ప్రసంగం 4-48 నిమిషాలకు ప్రారంభించి 5-03. నిమిషాలకు ముగించారు.