ఫార్మా సి లో సంగనభట్ల దివ్య కు డాక్టరేట్ పట్టా !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి చెందిన సంగనభట్ల దివ్య ఫార్మసీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది. మంగళవారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ దివ్య కు డాక్టరేట్ పట్టాను ప్రధానం చేశారు.

బి ఫార్మసీలో బంగారు పతకం సాధించిన దివ్య ఎం ఫార్మసీ, జెఎన్టియు క్యాంపస్ లో పూర్తి చేసింది.


దాదాపు 20 కి పైగా అంతర్జాతీయ జర్నల్స్ లో ఆమె రాసిన ఆర్టికల్స్ ప్రచురించబడ్డాయి. ప్రచురితమైన అనేక ఆర్టికల్స్ ను. ఢిల్లీ పబ్లికేషన్స్ వారు పుస్తక రూపంలో ముద్రించి అమెజాన్ లో అందుబాటులో ఉంచారు. దివ్య డాక్టరేట్ పట్టా. సాధించడం పట్ల పలువురు హర్షంవ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు
.