గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం!

👉 లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో..

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ లో భాగంగా వెల్గటూర్, బుగ్గారం మండలాల్లో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు లక్ష్మణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికి ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నరు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిందిగా లక్ష్మణ్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు.


ప్రచారంలో ఓయూ జేఏసీ చైర్మన్, టిపిసిసి నాయకులు డాక్టర్ కండ్లె మదన్ TPYC రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ చిట్ల విజేయ్, గోపులపూర్ గ్రామ శాఖధ్యక్షులు

గోవిందుల రమణ, బీరుపూర్ శ్రీనివాస్, చిట్ల సంతోష్, పార్టీ అధ్యక్షులు సుభాష్, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.
దివ్యాంగుల మద్దతు..


వెల్లటూరు మండలం పాశీగామా గ్రామంలో గడపగడప కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా. దివ్యాంగులు లక్ష్మణ్ కుమార్ కు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు.


ధర్మపురి పట్టణంలో…


కాంగ్రెస్ నాయకులు, మహిళ కౌన్సిలర్ లు, శ్రేణులు ధర్మపురి పట్టణంలోని తోట్లవాడను ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు