గులాబీ బాస్ సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్..

J.SURENDER KUMAR,

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 13 నుంచి 28 వరకు 54 నియోజకవర్గాల సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈనెల 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు.
రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడానికి.. గులాబీ దళాధిపతి, సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా అక్టోబరు 15 నుంచి మొదటి విడత ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి.. నవంబరు 3తో ముగిశాయి. ఇప్పుడు మరో 54 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది.
ఈనెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో బీఆర్‌ఎస్‌ అధినేత పాల్గొననున్నారు. ఇప్పటివరకు 30 నియోజకవర్గాల్లోని సభలో పాల్గొన్నారు. అందులో ఈనెల 9 వరకు మరో 12 సభలకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈనెల 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు.. ఈనెల 25న హైదరాబాద్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని.. ప్రసంగించనున్నారు. అదే విధంగా ఈనెల 28న గజ్వేల్‌ సభతో ప్రచారపర్వాన్ని కేసీఆర్‌ ముగించనున్నారు.



సీఎం కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూల్‌

👉13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌
👉14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
👉15 న  బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌
👉16న  ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌
👉17న  కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల
👉18 న చేర్యాల
👉19 న అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి
👉20న మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ
👉21న మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట
👉22న తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి
👉23 న మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు
👉24 న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
👉25 న హైదరాబాద్‌లో భారాస ప్రజా ఆశీర్వాదసభ
👉26 న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
👉27 న షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి
👉28 న వరంగల్‌ (ఈస్ట్‌, వెస్ట్‌), గజ్వేల్‌