ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం!

👉జువ్వడి నర్సింగరావు ఆధ్వర్యంలో..


J.SURENDER KUMAR,

కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఇబ్రహీంపట్నం , మల్లాపూర్ మండలాలలో ఆదివారం కోరుట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామ బిఆరెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఉప సర్పంచ్ చల్ల సునీల్ భారీగా తన అనుచర గణంతో నర్సింగ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు.


మల్లాపూర్ మండల కార్యకర్తల సమావేశంలో రాఘవపేట్, చిట్టాపూర్, కుస్థాపూర్. పాత దామరాజుపల్లి. మల్లాపూర్ ల నుండి భారీ సంఖ్యలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, తాను మా నాన్న మాజీ మంత్రి స్వర్గీయ రత్నాకర్ రావు, బాటలో నడుస్తూ గ్రామీణ ప్రాంతల అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనా అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి పార్టీ అనుచరులు నాయకులకే సంక్షేమ పథకాలు పంచి పెడుతున్న విషయాన్ని గుర్తించాలని నర్సింగరావు విజ్ఞప్తి చేశారు.


కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.