👉కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా!
J.SURENDER KUMAR,

శాసన సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది కేటాయింపులకు రెండవ రాండమైజేషన్ పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో పోలింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో నిర్వహించారు. జిల్లాలోని కోరుట్ల పరిధిలోని 262, జగిత్యాల పరిథి లోని 254, ధర్మపురి పరిథి లోని 216, చొప్పదండి పరిధిలోని 108 , వేములవాడ పరిథి లోని 90 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన 4472 మంది అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇందులో 1118 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1118 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 2236 మంది ఇతర పోలింగ్ సిబ్బంది(ఒపిఒ) లను నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రాజీవ్ రంజన్ మీనా,
హెచ్. బసవ రాజేంద్ర, వివేకానంద సింగ్, షీల్ ఆశిష్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, ఆర్డీఓ లు నరసింహ మూర్తి, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.