జగిత్యాల జిల్లాలో అధికార పార్టీకి వత్తాసు పలికిన ఉద్యోగి సస్పెండ్ !

👉ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా !

J.SURENDER KUMAR,

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు సురేష్ నాయక్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలో పనిచేస్తున్న కళాకారుడు సురేష్ నాయక్ ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఉల్లంఘించి అక్టోబర్ 28న ఖానాపూర్ నియోజక వర్గం ఉట్నూర్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచార సభలో పాల్గొని ప్రచారం నిర్వహించి నందున అతనిని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఏ పార్టీకి పక్షపాతంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన వద్దని తెలంగాణ సాంస్కృతిక సారధి సభ్య కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని,