కెసిఆర్ కు ప్రతిపక్ష హోదా వస్తుందో ? రాదో ? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,

ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములు సహజం. ఎన్నికల అనంతరం కెసిఆర్ కు ప్రతిపక్ష హెూదా వస్తుందా లేదా చూడాలి.. ప్రతిపక్ష పాత్ర అయినా బాధ్యత గా సక్రమంగా నిర్వర్తించాలి.. ప్రజలు తనను ఓడిస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటామని కేసీఆర్ అనడం, ప్రజాస్వామ్యం పై కేసీఆర్ కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మబలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకుండ కేసీఆర్ నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీశారు. ఓటర్లను ఆకర్షించాలనే ఆలోచన తప్ప, శాశ్వతం ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చొరవ చూపలేదు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర నిధులు!
తెలంగాణ రాష్ట్ర నిధులు ఆంధ్రోళ్లుదోచుకుంటున్నారు.. నీళ్లు అన్నీ సముద్రం పాలు అవుతున్నాయి.. నియామకాల్లో తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరుగుతోందని ఉద్యమిస్తే, కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలు నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు నెల వేతనం !
ఉద్యోగులకు నెల వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ సర్పంచులకు చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అదనపు జిల్లాల ఏర్పాటుతో అదనపు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉండగా, ప్రభుత్వ శాఖలను కుదించారు. ఒక్క అదనపు ఉద్యోగ కల్పన లేదు. రాష్ట్రంలో 1లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇవ్వగా, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. సుమారు 2లక్షల ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లతో సుమారు 66వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు వచ్చేవి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానికత ఆధారంగా నియామకాల కోసం నిరుద్యోగులు, ఉద్యోగులు, సకల జనులు ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అందరికి సమాన విద్య అవకాశాలు లభిస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని భావిస్తే, నిరాశే ఎదురైంది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుతో స్థానికత లేకపోవడంతో సామాజిక రిజర్వేషన్లు కేవలం 25శాతం మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ లక్ష్యాన్నే నీరుగార్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరణ చేస్తామని మాట మరిచారు. కేజీ ఓటు పీజీ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్భంద విద్య కేవలం ప్రకటనలకే పరిమితమైంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రతి ఏడాది లక్ష చొప్పున ఐదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తాం. గల్ఫ్ కార్మిక మృతుల కుటుంబాలను ఆదుకుంటాం. గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వారికి ఎస్ఆర్ఐ కోటా ఏర్పాటు చేయాలి.. సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పిస్తాం.. వాస్తవాలను గ్రహించాలి.. ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుతున్నారని, రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.