👉మీట్-ది-ప్రెస్ లో
👉టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియ న్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ న్యాయమైన పద్ధతిలో పోటీ చేయాలని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వారికి ధైర్యం ఉంటే కాంగ్రెస్ సవాళ్లను స్వీకరించి ఎన్నికల్లో పాల్గొనాలని సవాల్ విసిరారు. మరోవైపు కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అని విమర్శించారు.

శాసన సభ ఎన్నికల సందర్భంలో శుక్రవారం బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టీయూడబ్ల్యూజే ) నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు ఏ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమానికి సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి, మోడరేటర్ గా వ్యవహరించ గా, ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీలతో పాటు ఆయా భాషలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల 120 మంది పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.