J.SURENDER KUMAR,
వృద్ధాప్యంలో మనువులు, మనవరాలు తో గడపాల్సిన ఆ మాతృమూర్తి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న కుమారుడిపై కోపంతో జగిత్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేసింది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క్యూరిక్యాల గ్రామానికి చెందిన చీటి శ్యామల (82) ఆమె భర్త మురళీధర్ రావు స్వాతంత్ర సమరయోధుడు, అనే వృద్దురాలు తన బంధువుల ఆసరాతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వచ్చి నామినేషన్ వేసింది. ఆమె తన పెద్ద కొడుకు శ్రీరాంరావు కోర్టు కేసులు వేసి తనను ఇబ్బంది పెడుతున్నాడని, అధికార యంత్రాంగం ఎవరు తనకు న్యాయం చేయడం లేదని, ఎమ్మెల్యేగా గెలిచిన తన ఇబ్బందులను తానే పరిష్కరించుకోవడం కోసం నామినేషన్ వేసినట్లు తెలిపింది..
.