👉ముగ్గురు అభ్యర్థులకు ముచ్చెమటలు !
J.SURENDER KUMAR,
కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్, బీఆర్ఎస్, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారో ? గల్ఫ్ ఓట్ల గండి ఎవరికి పడుతుందో ? అని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట్టు చర్చ నెలకొంది.
కోరుట్లలో అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 లక్షల 36 వేల మంది ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకుంటే 1 లక్షా 77 వేల ఓట్లు పోల్ అవుతాయని అంచనా.
నవంబర్ 23 నాటి ఒక శాంపిల్ సర్వే ప్రకారం అభ్యర్థుల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.

నర్సింగరావు.
స్వల్ప ముందంజలో జువ్వడి..
కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు 26 శాతం (46,020),

బీఆర్ఎస్ అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ 24 శాతం (42,480),

బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 23 శాతం (40,710),

గల్ఫ్ సంఘాల అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు 17 శాతం (39,090), బీఎస్పీ తో సహా ఇతరులకు 10 శాతం (17,700) ఓట్లు సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఎవరు ? ఎవరిని ? ఓవర్ టేక్ చేస్తారో… ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
క్రికెట్, రాజకీయాలు, సినిమాలలో అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజు రోజుకు జరిగే రాజకీయ పరిణామాలతో అంచనాలు తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది.