కోరుట్ల నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటా !

కాంగ్రెస్ అభ్యర్థి జువ్వడి నర్సింగరావు.!


J.SURENDER KUMAR,

స్వర్గీయ జువ్వడి రత్నాకర్ రావు, ప్రతిరూపం ఆయన కోరుట్ల నియోజకవర్గలో చేసిన అభివృద్ధి పనులలో అగుపిస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రత్నాకర్ రావు తనయుడు, జువ్వడి నర్సింగరావు అన్నారు.


నియోజకవర్గ పరిధిలోని ముత్యంపేట్ గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, అభిమానుల, కార్యకర్తల సమావేశం ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, కృషి చేస్తానని, సాగు తాగునీటి సమస్యతో పాటు చక్కర కర్మాగారం తెరిపించడాని కి రాజిలేని పోరాటం చేస్తానన్నారు.

మరో వందరోజుల్లో ముత్యంపేట్ గడ్డ రాష్ట్ర భవిష్యత్తు ను నిర్ణయిస్తుందన్నారు. ఎ
సమావేశానికి ముందు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నుండి తరలివచ్చిన ప్రజలు

నర్సింగరావుకు గజమాల తో స్వాగతించారు.