👉వేములవాడ దేవస్థానం నుండి ₹50 లక్షల అప్పు!
👉₹ కోటి 55 లక్షలు నగదు చెల్లింపులు
👉ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం!
👉 నైట్ కాలేజీకి ₹10 లక్షలు ఇచ్చినా మూత పడేది కాదు!
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన కొట్లాది రూపాయల నగదు ఆదాయం కాంట్రాక్టర్ల పరం అయింది. వేములవాడ ఆలయం నుంచి మరో ₹50 లక్షల రూపాయల అప్పు తెచ్చి అధికారులు వారికి చెల్లించి కాంట్రాక్టర్ ల కన్నులలో సంతోషాన్ని చూచారు. నిధుల చెల్లింపుల పై సంబంధిత శాఖ కమిషనర్ కు ఫిర్యాదులు చేసిన ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఈ చెల్లింపులు ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ రాజన్న అప్పు తీరలేదు, ధర్మపురి ఆలయానికి ప్రభుత్వం నుంచి నిధులు జమ కాలేదు.
వివరాలు ఇలా ఉన్నాయి..
డబ్బులు పొందిన కాంట్రాక్టు సంస్థలు

సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2015, జులై మాసంలో గోదావరి నది పుష్కరాలు జరిగాయి. సీఎం కేసీఆర్ ధర్మపురి గోదావరి నదిలో పుష్కర స్నానం చేశారు. భక్తుల సౌకర్యార్థం కోట్లాది రూపాయల నిధులతో క్షేత్రంలో ప్రభుత్వం పనులు చేపట్టింది. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్తు, పారిశుద్ధ్య తదితర శాఖలకు చెందిన కొన్ని పనులను స్థానిక కొందరు నాయకులు బినామీల పేర్లతో సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనులు చేశారు. వారు చేసిన పనులకు బిల్లును చెల్లించడం కోసం 20 కాంట్రాక్టు సంస్థలకు ₹ 1,55,39, 922/- ( ఒక కోటి 55 లక్షల 39 వేల 92 2 రూపాయలు) ధర్మపురి ఆలయ నగదు ఆదాయం నుంచి వారికి చెల్లించారు.
ఇందులో ఆలయం నుంచి ₹ 59, 51,474/-. వేములవాడ ఆలయం నుంచి ధర్మపురి ఆలయానికి అప్పుగా తీసుకున్న ₹ 50 లక్షల రూపాయలు, దేవాదాయ డిప్యూటీ కమిషనర్ ద్వారా ( ఆలయం పేరిట ఉన్న ఫిక్స్ డిపాజిట్ విడిపించి) ₹ 45,88,448/-. మొత్తం ఒక కోటి 55 లక్షల 39 వేల,922/- రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారు.
పుష్కరాల ఆదాయం ₹ 2 కోట్లు..
12 రోజులపాటు జరిగిన పుష్కరాలలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ₹ 2,38,90,156/-.( రెండు కోట్ల 38 లక్షల, 99 వేల,156. రూపాయల) ఆదాయం వచ్చింది.
ఇందులో టికెట్లు, ప్రత్యేక దర్శనం, ప్రసాదాల అమ్మకాలు, అన్నదానం ద్వారా
₹ 1,48,71,328/- రూపాయలు.. హుండీ ద్వారా ₹ 90, లక్షల 18 వేల, 828 రూపాయలు వచ్చాయి.
ఆలయ నిధుల అవకతవకలపై ఫిర్యాదు !

ఆలయ నిధుల అవకతవకలపై. ఆలయ పాలక వర్గ మాజీ చైర్మన్, జువాడి కృష్ణారావు, అప్పటి దేవదాయ శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి శివశంకర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి 2018, నవంబర్ లో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవు.
కొన్ని సంవత్సరాలుగా ఇంచార్జ్ . ఎగ్జిక్యూటివ్ అధికారులే..
సాలినా దాదాపు ₹6 కోట్ల ఆదాయం గల ఇక్కడి ఆలయానికి 2018, జులై మాసం నుండి 2023 నవంబర్ నాటికి ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారులే, తప్ప రెగ్యులర్ కార్యనిర్వహణాధికారి లేకపోవడం ప్రత్యేకత.
శాశ్వత ట్రస్ట్ బోర్డు లేదు..
ట్రస్ట్ బోర్డు కు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేగా ప్రభుత్వ ఉత్తర్వులు!

స్వరాష్ట్రలో.2017 మే మాసంలో ఏర్పడిన ట్రస్ట్ బోర్డు పదవి కాలం 2018 జనవరి ముగిసింది. రెండోసారి 2018, జులై మాసం నుంచి 2019, జూలై మాసం వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పడింది. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి కమిటీ కొనసాగుతున్నది. 2022, డిసెంబర్ మాసంలో ప్రభుత్వ కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ సంఖ్య. 46049,Endts-II/A2/2022, ద్వారా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కోసం ప్రకటన జారీ చేయవలసిందిగా ధర్మపురి ఆలయ అధికారులకు ఉత్తర్వులు చేసిన, అధికారులు ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు కు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.
స్థానిక తెలుగు ( నైట్ కాలేజ్) కళాశాలకు ₹ 10 లక్షలు చెల్లించినా మూతపడేది కాదు!
నైట్ కాలేజ్ బోర్డుపై నాక్ సెంటర్ !

క్షేత్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల( నైట్ కాలేజ్ ) కు ఆరు దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. వేలాదిమంది యువత ఇక్కడ చదువుకొని ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో ఉపాధ్యాయులుగా, లెక్చరర్ కొనసాగుతున్నారు. ఎయిడెడ్ కళాశాల కావడంతో ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్. నిలిపివేసింది. కాంట్రాక్టు లెక్చర్ల కు. (ఇద్దరు ముగ్గురికి) జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతి సంవత్సరం.₹3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కళాశాలకు అందించి ఉండి ఉంటే. ఘన చరిత్ర గల తెలుగు కళాశాల ( నైట్ కాలేజ్) మూతపడేది కాదని, సొంత భవనం, ఫర్నిచర్, లైబ్రరీ, విశాల మైదానం గల నైట్ కాలేజీలో ప్రభుత్వం న్యాక్ సెంటర్ ఏర్పాటు పట్ల కళాశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి కాంట్రాక్టర్లకు చెల్లించిన నగదును ధర్మపురి ఆలయ ఖాతాకు జమ చేయించి. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామిని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి రుణ పడి ఉన్న స్వామివారిని విముక్తిని చేయాల్సిందిగా భక్తజనం, ప్రజలు ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నారు.