మా భూమి నీ అమ్ముకుంటున్నారు ప్రకటనలో మావోయిస్టుల.!

J.SURENDER KUMAR,

హుస్నాబాదులో అమరవీరుల స్తూపం కోసం ఇచ్చిన 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వారు వెంటనే అమ్మినవారి నుంచి డబ్బులు తిరిగి తీసుకోవాలని మావోయిస్టు పార్టీ JMWP డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రకటన సారాంశం..
ఉద్యమం బలహీన పడడంతో 2022 డిసెంబర్ లో ఆ భూమి పట్టాదారునిగా ఉన్న దివంగత డిఎస్పీ రాంచంద్రారెడ్డి కొడుకు రాజేశ్వర్ రెడ్డి 4 ఎకరాలు స్థూపానికి ఇచ్చిన భూమిని, ₹ 25 కోట్లకు కాంతాల రాజేందర్ రెడ్డి (కిసాన్ ఫర్టిలైజర్ దుకాణం), అబ్బర బోయిన సహదేవ్ (గుబ్బడి), బాబురావు (మాజీ పట్వారీ), క్యాప రాము (జగదాంబ రెస్టారెంట్), సన్నీ శ్రీను (వ్యాపారి), కొండూరి శ్రీకాంత్, (వ్యాపారి), బెగజం శ్రీను (వ్యాపారి), మార్గం రవిందర్ (వెహికల్ ఇన్స్పెక్టర్), గుండా శ్రీను, కొత్త శ్రీనివాస్ లకు అమ్మినాడు. వీల్లందరు స్థూపానికి చెందిన 4 ఎకరాల భూమిని ప్లాట్లు పెట్టి అమ్ముతున్నారు. అని పేర్కొన్నారు.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో CPI మావోయిస్టు ( గతంలో పీపుల్స్ వార్ ) పార్టీ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో నక్షల్బరిలో దారిలో పోరాడి జగిత్యాల, సిరిసిల్ల లో జైత్రయాత్ర నడిపించి అమరులయ్యారు. ఆ అమరుల జ్ఞాపకార్థం 1990 లో హుస్నాబాద్ పట్టణంలో స్తూపం నిర్మాణం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఆ పట్టణంలో భూస్వామి అడానికి జిల్లాలో ఉన్న విప్లవ ప్రజానీకం మేస్త్రీలు వచ్చి స్తూపం నిర్మాణం చేశారు. ఆ స్తూపంపై జిల్లాలో అమరులందరి పేర్లు పెట్టారు. ఆ స్తూపం లోనే వారి బిడ్డలను చూసుకునేవారు. ఆ స్తూపం ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద స్తూపాల్లో ఒకటిగా రికార్డులోకి ఎక్కింది.
ఆ అమరుల స్తూపం చూడగానే పీడిత ప్రజలందరికీ ఎర్ర రాజ్యాధికారం గుర్తుకు వచ్చేది.
ప్రపంచ బ్యాంకు ఏజెంట్ టిడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో గ్రీన్ టైగర్స్, క్రాంతి సేన పేర్లతో ఆ స్తూపాన్ని డైనమెట్లతో కూల్చివేశారు దివంగత డి ఎస్ పి ముత్తినేని రాంచంద్రారెడ్డి (సర్వే నెంబర్ 1189) లోని 4 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఒప్పుకుని రాసి ఇచ్చినాడు. ఆ భూమిలో 1990లో స్తూపం నిర్మాణం చేశామని పేర్కొన్నారు.
ఈ స్థూపానికి చెందిన 4 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వాల్లందరు వెంటనే డబ్బులు వాపస్ తీసుకోవాలి. లేనిచో ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాము. అంటూ ప్రకటనలో పేర్కొన్నారు
.