J.SURENDER KUMAR,
హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తా లొని రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి ఒంటరిగా కనిపించడంతో.. అక్కడకు వచ్చిన వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, వితౌట్ ప్రోటోకాల్ కేటీఆర్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరు గుర్తుపట్టలేదు.. కాని ఆర్డర్ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు.

కేటీఆర్ వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది కాని.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం చూసి షాక్ అయ్యారు. ఆయన బిర్యానీతోపాటు.. పలురకాల దేశ విదేశీ వంటకాలను రుచిచూశారు. మంత్రి వచ్చారని తెలుసుకునీ రెస్టారెంట్ యాజమాన్యం ఆయనకు స్పెషల్ డిషెస్‌ను వడ్డించారు.

కేటీఆర్ డిన్నర్ చేస్తూనే.. అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. అటు హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం జనం ఎగబడ్డారు .