J.SURENDER KUMAR,
ఈనెల 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విచ్చలవిడి మద్యం విక్రయాల. నియంత్రణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ 2023 అక్టోబర్ 16న, లేఖ సంఖ్య 464/Seizure/GE-LAs/2023 EEP, ద్వారా జారీ చేసిన సర్కులర్ నిబంధనలు ఆశించిన మేరకు జిల్లాలో అమలు కావడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి .

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాజస్థాన్ మరియు తెలంగాణ శాసనసభలకు సంబంధించిన సాధారణ ఎన్నికలు, 2023-మద్యం నిల్వలు, అక్రమ పంపిణీని నిరోధించడం, తదితర పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం, ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేక అధికారి నియమించింది. తెలంగాణ రాష్ట్రానికి N. A. అజయ్ రావు, Addl. కమీషనర్, ఎక్సైజ్ నోడల్ అధికారి కి బాధ్యతలు అప్పగించింది.
ప్రత్యేకంగా 2013, నవంబర్ 14న జారీ కాబడిన సర్కులర్ సంఖ్య 76/.. లో పేర్కొన్న ఆదేశాల మేరకు నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొనబడింది.
👉 నిబంధనలు..
మద్యం మానిటరింగ్ కోసం జిల్లా ఎక్సైజ్ అధికారి నుండి కలెక్టర్‌కు రోజువారీ నివేదిక ( సగటు తేదీ-నెలలో 30% లేదా అంతకంటే ఎక్కువ అమ్మకాలు ఉన్న దుకాణాలు మాత్రమే రోజువారీగా.) విధిగా పంపించాలి.
👉 జిల్లా పేరు, తేదీ, దుకాణం నెంబర్,
దుకాణం పేరు, మరియు సగటు చిరునామా
తేదీ- నెల –సంవత్సరం రోజువారీ అమ్మకాల ( బల్క్ లీటర్‌లో ) వివరాలు ఉండాలి.
నిన్నటి విక్రయం (బల్క్ లీటర్‌లో)
అమ్మకాలలో పెరుగుదల శాతం (%)
పెరుగుదలకు కారణాలు ?
చర్యలు తీసుకున్నారా ?
అనుబంధం 2
మద్యం మానిటరింగ్ కోసం కలెక్టర్ మరియు DEO నుండి CEO వరకు రోజువారీ నివేదిక
1. జిల్లాలో IMFL దుకాణాల సంఖ్య:
2. జిల్లాలో కంట్రీ లిక్కర్ షాపుల సంఖ్య:
3. అన్ని దుకాణాలలో బ్రాండ్ వారీగా స్టాక్ రిజిస్టర్ నిర్వహించ బడుతుందా ?
👉 ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన దుకాణాలపై తీసుకున్న చర్యలు, ప మరియు సరైన బ్రాండ్ వారీగా స్టాక్ రిజిస్టర్లు వివరించాలి
4. జిల్లాలో సున్నితమైన మద్యం రిటైల్ దుకాణాల జాబితా:
పూర్తి చిరునామా, మరియు లైసెన్స్‌దారు పేరు, మరియు దానిని సున్నితమైనదిగా వర్గీకరించడానికి గల కారణాలతో జాబితాను జతపరచాలి
👉 ఏదైనా ఉల్లంఘనలకు సంబంధించి మద్యం దుకాణాల పై తీసుకున్న చర్య తీసుకున్న చర్య మరియు జరిమానా వివరాల సమాచారం వివరించాలి.
👉ఎన్నికల లో అక్రమ మద్యం పంపిణీని నిరోధించడం, కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు సూపరింటెండెంట్ ముఖ్యమైన బాధ్యతలలో ఒకటని సర్కులర్ లో పేర్కొనబడింది. ఎన్నికల సంఘం పరిశీలకులు కూడా పర్యవేక్షించవచ్చు .
👉సమస్యాత్మక ప్రాంతాలలో అధికారులు, సాయుధ దళాలను రౌండ్-ది-క్లాక్ నిఘా ఉంచాలి. అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న అధికారులకు ఎన్నికల సమయంలో మద్యం ప్రవాహాన్ని పర్యవేక్షించే ప్రత్యేక బాధ్యతను అప్పగించారు. ఎన్నికలలో ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం రాకుండా సరిహద్దు చెక్‌పోస్టు లు ఏర్పాటుచేసి అక్కడ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి అని సర్కులర్ లో పేర్కొనబడింది.
👉తరలివస్తున్న బెల్లం పెద్ద వ్యాపారులను తప్పిస్తున్న వైనం !
జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణానికి 12 టైర్ల ట్రక్కు వారం రోజులకు రెండుసార్లు 1000 కాటన్ ల లో తెల్ల బెల్లం లోడ్ వస్తుంది. జగిత్యాల తో పాటు కోరుట్ల, మెట్టుపల్లి లో అన్ లోడ్ జరుగుతుంది. ఇదే తరహా లో కరీంనగర్ , ధర్మారం , పెద్దపల్లి కి మరో ట్రక్కు లో వ్యాపారస్తుల కు బెల్లం తరలివస్తుంది. మహారాష్ట్రలోని కేడి గ్రామ్, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఈ బెల్లం రవాణాను నియంత్రించకుండా, మండల కేంద్రాలలో బెల్లం విక్రయిస్తున్న చిన్న చితక వ్యాపారస్తులను, గతంలో బెల్లం వ్యాపారం చేసిన వారిని కేసుల కోసం బైండోవర్ చేస్తాం మీరు నాటు సారా కోసం బెల్లం అమ్ముతున్నట్టు ఒప్పుకోండి, అంటూ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
👉విచ్చలవిడిగా మధ్య అమ్మకాలు !

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో సమయపాలన పాటించకుండా మద్యం దుకాణాలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఆ శాఖ అధికారులు అటువైపు చూడడానికి, నిబంధన ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడానికి జంకుతున్నారు. నడిరోడ్డుపై మద్యం షాపు ముందరే మద్యం సేవిస్తున్న అధికార యంత్రాంగం వాటిని అరికట్టే సాహసం చేయలేక పోతుంది. ఆ రోడ్డు పై నడిచే వారు, మహిళలు, సాయంత్రం వేళలలో భయాందోళనకు గురవుతున్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.