మేనిఫెస్టో మా పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిది !

👉టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ  ‘అభయహస్తం’ పేరుతో.. 42 పేజీలతో విడుదల చేసిన మేనిఫెస్టో మా పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో శుక్రవారం కాంగ్రెస్‌ మేనిఫెస్టోను. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..

👉హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం
👉మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2 లక్షలు
👉రేషన్‌ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం
👉మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక నిధి
👉ఆర్టీసీ కార్మికులకు 2 పీఆర్సీ బకాయిల చెల్లింపు
👉పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులు
👉ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం
👉పెండింగు ట్రాఫిక్ చలానాలపై 50 శాతం రాయితీ
👉బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు
👉ఎస్సీ వర్గీకరణ అమలు
👉మాదిగ, మాల, ఎస్సీ ఉపకులాలకు కార్పొరేషన్లు
👉బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన
👉సంచార జాతులకు 5శాతం రిజర్వేషన్
👉అన్ని జిల్లాల్లో జయశంకర్‌ పేరిట బీసీ భవన్లు
👉జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు
👉అన్ని వెనుకబడిన కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
👉బీసీలు, మైనారిటీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు
👉సింగరేణి కారుణ్య నియామకాల సరళీకరణ
👉ఈఎస్‌ఐ పరిధిలోకి బీడీ కార్మికుల జీవిత బీమా
👉గీత కార్మికులకు ₹.10 లక్షల బీమా
👉యాదవ, కురుమలకు రూ. 2 లక్షల గొర్రెల పంపిణీ
👉అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత
👉స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల రుణం
👉పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం
👉18 ఏళ్లు దాటిన విద్యార్థినికి ఉచితంగా స్కూటీ
👉అన్ని జిల్లా కేంద్రాలలో వృద్ధాశ్రమాలు
👉జూనియర్ లాయర్లకు నెలకు రూ. 5,000 భృతి
👉రేషన్‌కార్డు ఉన్న వారికి సన్నబియ్యం
👉గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు
👉మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షలు
👉దివ్యాంగుల పింఛను రూ.5,016
👉దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్ని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్నాయని బీఆర్ఎస్‌ పాలనలో భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తామని అన్నారు. ప్రజలకు సంపదను పంచే ప్రణాళికను మేనిఫెస్టోలో పెట్టినట్లు పలువురు పేర్కొన్నారు.