J.SURENDER KUMAR,
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం నిర్వహించిన బీఆర్ఎన్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు.
కేటీఆర్, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో ప్రచార వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచార రథం పైనుంచి ముందుకు పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను కిందపడకుండా పట్టుకున్నారు. ఎంపీ సురేశ్ రెడ్డి కిందపడ్డారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే…
వాహనం పై భాగంలో అభ్యర్థులు నిలిచి ప్రజలకు అభివాదం చేయడానికి వాహనంపై గ్రిల్స్ తో వెల్డింగ్ చేశారు. వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహన గ్రిల్ ఊడిపోవడంతో నేతలంతా కిందపడబోయారు. ఘటనలో సురేశ్ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. అనంతరం నామినేషన్ వేసేందుకు కేటీఆర్, నేతలు వెళ్లారు. తరువాత మంత్రి కేటీఆర్ ఆర్మూర్ నుంచి కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు.