J.SURENDER KUMAR,
మావోయిస్టు పార్టీ లో ఇంటి దొంగ కలవరం మొదలైంది. పార్టీ డబ్బులను, ఆ పార్టీ నాయకుడు బందారపు మల్లయ్య @ చంద్రన్న పార్టీ డబ్బులు ఎత్తుకుపోయాడని ఆ పార్టీ JMWP డివిజన్ జారీ చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొంది.
చంద్రన్న విప్లవ ప్రజలు, అమరవీరుల కుటుంబాలు ఎవరు నమ్మవద్దు. అంటూ ప్రకటనలో వివరించింది.
పెద్దపల్లి జిల్లా, ముత్తారం మండలం, మచ్చుపేట గ్రామానికి చెందిన బందారపు మల్లయ్య (చంద్రన్న) 1986-87 మద్యలో గత పీపుల్స్ వార్ పార్టీ లోకి రిక్రూట్ అయినాడు. అప్పటి నుండి మంథని ఏరియాలో చంద్రన్న పేరుతో దళ సభ్యుడి నుండి కమాండర్ గా జిల్లా కమిటీ మెంబర్ గా పనిచేసాడు.

మంథని ఏరియాలో పనిచేస్తున్న క్రమంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటలన్నింటికీ నాయకత్వం వహించాడు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నింటిలో ప్రజలు అరెస్టులను, నిర్బంధాలను ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతూ ఎంతోమంది కామ్రేడ్స్ బూటకపు ఎన్కౌంటర్లలో అమరులయ్యారు. మచ్చుపేట గ్రామంలో కామ్రేడ్ గట్టన్న, కామ్రేడ్ అమృత అక్క తో పాటు దాదాపు ఎనిమిది మంది కామ్రేడ్స్ వారి ఆశయ సాధనలో అమరులయ్యారు. ప్రకటనలో పేర్కొన్నారు.
ఉద్యమ అవసరాలరీత్యా 2003 లో దండకారణ్యానికి బదిలి అయి గడ్చిరోలిలో జిల్లా కమిటీ మెంబర్ గా, జిల్లా కమిటీ కార్యదర్శిగా చంద్రన్న పని చేసాడు. పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో కష్టనష్టాల కోర్చి, నిర్బంధాన్ని ఎదుర్కొని విప్లవ నిబద్ధతతో పనిచేశాడు.
కాని ఉద్యమంలో వస్తున్న ఎగుడు దిగుడులను, మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోలేక నిర్బంధం పెరిగి దాడులు జరగడంతో ప్రాణ భయంతో విప్లవ ప్రజలకు ద్రోహం చేసి డబ్బులు ఎత్తుకుని పారిపోయాడు. కాబట్టి బందారపు మల్లయ్యను విప్లవ ప్రజలు, అమరవీరుల కుటుంబాలు ఎవరు నమ్మవద్దని ప్రకటనలో డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు.