👉 ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్
J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు అందరికీ శుక్రవారం ఒక చారిత్రిక సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత మళ్ళీ జర్నలిస్టుల గృహ వసతి గురించి ఆలోచించిన ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.
పాదయాత్ర సందర్భంగా చాలా చోట్ల జర్నలిస్టులు జగన్ మోహన్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను విన్నవించిన నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎన్నికల ప్రణాళిక లో పొందుపరిచిన హామీ ని శుక్రవారం నెరవేర్చారన్నారు. వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఆయన క్యాబినెట్ సహచరులకు మరొసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి తరఫున కృతజ్ఞతలు. తెలుపుతూ అమర్ ప్రకటనలో పేర్కొన్నారు.
.