J.SURENDER KUMAR,
మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చర్చ. కేంద్ర సెంటర్ వాటర్ కమిషన్ ఉన్నతాధికారి సంజయ్ కుమార్ సింబల్ ఈనెల ఒకటిన రంజిత్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖ లోని అంశాలపై నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ . ఈఎన్సీలు, ఇంజినీర్లతో శనివారం సమీక్ష సమావేశమైన నివేదికలోని అంశాలపై చర్చించారు.

ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, సీఈలు, టెక్నికల్ కన్సల్టెంట్ రామరాజు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే సమీక్షలో పాల్గొన్నరు. ఎన్ఎస్డీఏ నివేదికలో లేవనెత్తిన అంశాలపై వివరంగా చర్చించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీను నిర్మించారు. ఈ బ్యారేజీని మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే తెలంగాణ – మహారాష్ట్రను కలిపే ఈ బ్యారేజీ వంతెన అక్టోబరు 22న 20వ పిల్లర్ కుంగిపోయింది. దీంతో 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఇంజినీర్లు బ్యారేజీలోని 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై వెంటనే బ్యారేజీ నిర్వాహకులకు సమాచారం అందించారు.
కేంద్ర జల్ శక్తి శాఖ.. ఆరుగురితో కూడిన నిపుణుల బృందాన్ని వెంటనే తెలంగాణ పంపించింది. బ్యారేజీ దగ్గర పగుళ్లు ఏర్పడిన పిల్లర్లను పరిశీలించిన కేంద్ర బృందం.. రాష్ట్ర అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 20 అంశాలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరింది. అందులో 18 అంశాలను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఇంకా మరో రెండు అంశాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వివరణ ఇవ్వాల్సి ఉంది.
అయితే వీటన్నింటినీ పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్మాణంలో లోపం ఉందని చెప్పింది. పిల్లర్ల కింద ఉండే ఇసుక కోతకు గురైందని తెలిపింది.

మరోవైపు శుక్రవారం అన్నారం బ్యారేజీ లోని రెండు చోట్ల ఏర్పడిన సీపేజీని కేంద్ర జల సంఘం డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులను సీడబ్ల్యూసీ అధికారులు కోరారు.