మేడిగడ్డ ప్రాజెక్టు పై మంత్రి హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదు !

👉డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ..

J.SURENDER KUMAR,

మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది రైతులకు నీరందిస్తామని చెప్పి దాన్ని నిర్మింపజేసి ఇప్పుడు అది కుంగిపోగానే సంబంధిత శాఖ మంత్రి గా కొనసాగిన హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదు అని జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నిలదీశారు.

ధర్మపురి పట్టణంలో లక్ష్మణ్ కుమార్, తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
.మీడియా సమావేశం ముఖ్యాంశాలు..
👉కాలేశ్వరం ప్రాజెక్టును భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నిర్మించారని లక్షలాదిమంది రైతులకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రచారం చేసుకున్నారు.
👉కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని మేడిగడ్డ ప్రాజెక్టుగా మార్పు చేసిందన్నారు.
👉 డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వారు మేడిగడ్డ ప్రాజెక్టుపై ఇచ్చిన 11 అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ , శాఖ మంత్రి హరీష్ రావు,. లేదా ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇప్పటివరకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు.
👉కాంగ్రెస్ పార్టీ హయాంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నిజామాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలకు గ్రావిటీ ద్వారా మీరు అందించే అవకాశం ఉండేది.
👉ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో కమిషన్లకు ఆశపడి లక్షలాది కోట్ల రూపాయలను దోచుకోవాలనే ఉద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది
👉కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన మొత్తాన్ని దోచుకొని దాన్ని దాచుకోవాలి అన్న రీతిలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది
👉కాలేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏటీఎంలో మారింది. మంచి జరిగినప్పుడు ఆర్భాటాలు చేసిన బిఆర్ఎస్ నాయకులు ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఇంత లోపం జరిగితే ఎందుకని దాని గురించి మాట్లాడడం లేదు.
👉కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గడపగడపకు తీసుకెళ్తాం..
ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు