ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖర్చు ₹40 లక్షలు మించితే డిస్ క్వాలిఫికేషన్ !

👉ఎన్నికల వ్యయ పరిశీలకుడు షీల్ ఆశిష్ !


J.SURENDER KUMAR,

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ₹ 40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని, అంతకంటే మించితే డిస్ క్వాలిఫై అవడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్ ఆశిష్ అన్నారు.

సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 7780137501 లేదా expenditure observer.jagtial@gmail.com కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అదనపు కలెక్టర్ లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధ్యతతో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని, ఎన్నికలకు సంబంధించిన రూల్స్, నిబంధనలు ప్రతీ ఒక్కరు చదవాలని, ప్రతీ విషయం తెలుసుకోవలసి ఉండాలని అన్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహణకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్ ఆశిష్ అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, సి విజిల్ పై జిల్లాలో స్వీప్ కార్యక్రమం క్రింద విస్తృత ప్రచారం నిర్వహించామని, జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు, యువతకు ఆప్ పై అవగాహన కల్పించి సుమారు 15 వేల మంది సి విజిల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. అంతకు ముందు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, అదనపు ఎస్పీ ప్రభాకర్, ఇతర శాఖల అధికారులు, నోడల్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

..