J.SURENDER KUMAR,
సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాను చేసిన సవాల్ నెరవేరుతుందో ? లేదో ? లేదా కవిత నే ఈ ఎన్నికలు సవాల్ చేయనున్నాయా ? అనే అంశం డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు ఓటమిలు వెలుగు చూసేవరకు వేచి చూడాల్సిందే.

ఎమ్మెల్సీ కవిత చేసిన సవాల్ గూర్చి తెలియాలి అంటే. 2023 ఆగస్టు లో ఆమె హైదరాబాదులో
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ” వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఓడిస్తానని కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఆయన నిజామాబాద్‌లో కాకుండా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నా.. అక్కడ కూడా ఓటమి తప్పదని వెంటపడి ఓడిస్తానని సవాల్ చేశారు.
నాటి విలేకరుల సమావేశంలో, టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు కూడా ఉన్నారు.
కోరుట్లలో బిజెపి అభ్యర్థి అరవింద్ గెలిస్తే…
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నిజాంబాద్ పార్లమెంట్ సి ట్టింగ్ ఎంపీ, సీఎం కెసిఆర్ తనయ , కల్వకుంట్ల కవితను ఓడించడంతో దేశవ్యాప్తంగా. సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
రాజకీయ ప్రత్యర్థులైన కవిత, అరవింద్ లు అనేక సందర్భాల్లో ఆరోపణలు ప్రతి, ఆరోపణలు చేసుకోవడం పరిపాటి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అరవింద్ విజయం సాధిస్తే. కొన్ని నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో ఎమ్మెల్సీ కవిత పోటీలో ఉండి ఉంటే రాజకీయ కష్టాలు తప్పవు అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అరవింద్ ఓటమి చెందితే, ఎమ్మెల్యేగా గెలవనివాడు ఎంపీగా ఎలా గెలుస్తాడంటూ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఆరోపణలు చేసే అవకాశం ఉందని చర్చ. నెలకొంది.

2023 ఆగస్టు లో. జరిగిన విలేకరుల సమావేశం (ఫైల్ ఫోటో)
ప్రస్తుతం కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్, స్వర్గీయ మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు తనయుడు నర్సింగరావు కాంగ్రెస్ అభ్యర్థిగా, బిజెపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి ధర్మపురి అరవింద్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. గల్ఫ్ కార్మికుల పక్షాన అభ్యర్థిగా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. గల్ఫ్ కార్మికుల పక్షాన పోటీ చేస్తున్న శ్రీనివాసరావు సాధించే ఓట్లతో పాటు, కోరుట్ల పట్టణంలోని మైనారిటీ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకం కానున్నాయి.