
👉విధుల్లో చేరిన గంటలలోనే..
J.SURENDER KUMAR,
ఎన్నికల టీమ్ ల పనితీరును ఎన్నికల వ్యయ పరిశీలకులు షిల్ ఆశిష్ జిల్లాలో ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ధర్మపురి, బుగ్గారం మండలంలోని చిన్నాపూర్, గొల్లపల్లి, జగిత్యాల లో విధులు నిర్వహిస్తున్న SST, FST, VST టీమ్ లను ఎన్నికల వ్యయ పరిశీలకుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు.

జగిత్యాల పట్టణంలోని పలు పార్టీల ప్రచార వాహనాల అనుమతి పత్రాలను ఆయన పరిశీలించారు.

విధుల్లో చేరిన,IRAS అధికారి !
రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు IRAS అధికారి షీల్ ఆశిష్ జిల్లా ఆదివారం కేంద్రానికి చేరుకున్నారు.

ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా , అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర మరియు ఆర్డీఓ నరసింహ మూర్తి లు పరిశీలకులను మర్యాదపూర్వకంగా కలిసి పూల కుండీ మొక్కలను అందించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.