👉శైవ క్షేత్రాలే వారి రాజకీయ ప్రవేశానికి…
👉వారికి అచ్చి వచ్చిన “వి” అక్షరం..
J.SURENDER KUMAR,
నాలుగున్నర దశాబ్దాల క్రితం చేన్నమనేని విద్యాసాగర్ రావు, జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంథని అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన తనయుడు వికాస్ రావు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేములవాడ అసెంబ్లీకి పోటీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తండ్రి కొడుకులు ( సాగర్ జి, వికాస్ ) తమ రాజకీయ ప్రస్థానాన్ని శైవ క్షేత్రాల ( మంథని పరిధిలో కాలేశ్వర ముక్తేశ్వరాలయం, వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం) నుంచి ప్రారంభించడం కాకతాళీయం అయినప్పటికీ చర్చనీయాంశమే.
జాతీయ, రాష్ట్ర రాజకీయాలలో చేన్నమనేని విద్యాసాగర్ రావు @ సాగర్ జి పేరు, నాలుగు దశాబ్దాల రాజకీయ రంగంలో ఉన్నవారికి తెలిసి ఉంటుంది.
ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు గల విద్యాసాగర్ రావు విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ జనసంఘంలో కీలక వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలోబిజెపి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా,. కేంద్ర మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం సాగర్ జి రాజకీయ ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర సాధన బిల్లుకు పార్లమెంట్ లో ఆ పార్టీ మద్దతు ఇవ్వడంలో, మహారాష్ట్ర తెలంగాణ గోదావరి నెలకొని ఉన్న జలాల పరిష్కారంలో సాగర్ జిలకపాత్ర అనేది జగమెరిగిన సత్యం.
1977 లో కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన సాగర్ జి.1978 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి జనతా పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2023లో సాగర్ జీ తనయుడు వికాస్ రావు వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ కు బిజెపి టిక్కెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
సాగజికి అచ్చి వచ్చిన ” వి “. అక్షరం!
విద్యాసాగర్ రావు , ధర్మపత్ని పేరు, శ్రీమతి వినోద, కుమారుల పేర్లు, వివేక్, వికాస్, కూతురు వినయ, బందు వర్గంలో, రాజకీయ సన్నిహితులు సాగర్ జీ తో మీ కుటుంబ సభ్యుల పేర్లలోనే ఆరంభంలోనే విక్టరీ ఉందంటూ సరదాగా సంభాషించే సందర్భాలు అనేకం !