నాలుగు సార్లు ఓడిపోయిన నా కొడుకుని గెలిపించండి – అడ్లూరి లక్ష్మి !

J.SURENDER KUMAR,

మూడు నాలుగు సార్లు నా కొడుకు ఓడిపోయాడు, అవమానాల పాలయ్యాడు ఆర్థికంగా చితికిపోయాడు, ఈసారి మీ ఓటు నా కొడుకు వేసి గెలిపించండి అంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తల్లి లక్ష్మి చేతులు జోడించి ఓటర్లను వేడుకున్న తీరు పలువురిని కలచివేసింది.


ధర్మపురి నియోజక వర్గ కేంద్రమైన ధర్మపురి బ్రాహ్మణ సంఘ భవనంలో శనివారం జరిగిన మహిళల సమావేశంలో అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ తల్లి, భార్య, కాంత కుమారి, తోబుట్టువులు బంధువులు ఓటర్లను చేతులు జోడించి కన్నీటితో ఓట్లు వేసి లక్ష్మణ్ కుమార్ గెలిపించాల్సిందిగా ప్రార్థించారు.

బుగ్గారం, వెల్గటూర్ మండలంలోని ఇదే రోజు జరిగిన ప్రచార సభలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు. వేలకోట్లు ఉన్న కొప్పుల ఈశ్వర్ కు వేలాది మంది అభిమాను లు ఉన్న నాకు మధ్యలో జరుగుతున్న ధర్మ యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో మంత్రి కొప్పుల ఏమిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం నాకు వేయాలని దండం పెట్టి వేడుకున్నారు.

. గత ఎన్నికల్లో కూడా మీరు గెలిపిస్తే నా గెలుపును కొప్పుల ఈశ్వర్ దొంగతనంగా తారు మారు చేశారని ఆరోపించారు. లక్ష్మణ్ కుమార్ సతీమణి ప్రసంగిస్తూ గత నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడి పోయిన విధానాన్ని ఏడుస్తూ వివరించారు.


కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కౌన్సిలర్లు, భారీ సంఖ్య మహిళలు ప్రజల సభలో పాల్గొన్న రు.